హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై క్షేత్రస్థాయి పర్యటన

ASR: అనంతగిరి మండలంలోని జీనాబాడు, పినకోట, కివర్ల పంచాయతీల్లో జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ పర్యటనలో పలువురు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.