KRNL: కోసిగి కేజీబీవీ విద్యార్థిని ఈ. అమృత రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. మెడ్లీ రిలేలో కర్నూలు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచేలా కృషి చేసి సిల్వర్ మెడల్ సాధించింది. 100, 200 మీటర్ల పరుగులోనూ సెమీఫైనల్ వరకు చేరి సత్తా చాటింది. అమృత విజయంపై ప్రిన్సిపాల్ ఉమాదేవి, పీఈటీ సుమ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో KGBV విద్యార్థిని ప్రతిభ


