హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా తిరుపతి నాయక్

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుగులోతు తిరుపతి నాయక్ బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా ఆదివారం నియమితులయ్యారు. ఆయన ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, గిరిజన మోర్చా అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాల సమస్యలపై పోరాటం చేస్తానని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.