హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు నార్త్‌ డీఎస్పీ మురళీకృష్ణకు బదిలీ

GNTR: గుంటూరు నార్త్‌ డీఎస్పీగా రెండేళ్ల రెండు నెలలు పనిచేసిన సీహెచ్‌ మురళీకృష్ణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీగా బదిలీ అయ్యారు. విధుల్లో సహకరించిన అధికారులు, సిబ్బంది, మీడియా, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరిలో వీవీఐపీ బందోబస్తులు, భద్రతా ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. కీలక కేసుల ఛేదనలో సిబ్బంది కృషిని అభినందించారు.