హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో బోల్తా.. యువకుడు మృతి

NZB : డిచ్పల్లి మండలంలోని నడిపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ ఆటో బోల్తా పడటంతో బట్టు అంజి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అంజి తన తల్లి శోభితో కలిసి నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.