హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు ఆరు గంటల కరెంటూ లేదు'

MDK: రైతులకు కనీసం ఆరు గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ కూడా అందడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులను కలిసి సమస్యను వివరించారు. సరఫరా మెరుగుపడకపోతే అన్ని మండలాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన విద్యుత్‌ హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.