హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: బీటెక్ రవి

KDP: పులివెందులలో పార్టీ శ్రేణులతో బీటెక్ రవి సమీక్ష నిర్వహించారు. ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనే జల జీవన్ కార్యక్రమంపై చర్చించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి విజయానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పులివెందుల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.