హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లిపాయల విక్రయ కేంద్రం ప్రారంభం

ప్రకాశం: ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ రైతు బజార్‌లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బజార్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఉల్లిపాయలను అందుబాటు ధరల్లో విక్రయించాలని అధికారులు సూచించారు. కేజీ ఉల్లిపాయలు 35 రూపాయలకే అమ్ముతున్నట్లు తెలిపారు.