హైదరాబాద్: 28°C
తెలంగాణ

9 బైక్‌ల దొంగతనం.. ముగ్గురి అరెస్ట్‌

SRPT: మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని గరిడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సూర్యాపేట, మిర్యాలగూడ, దామరచర్ల తదితర ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.