హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరికలు

ADB: ఆదిలాబాద్‌ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో భోరజ్‌ మండలానికి చెందిన బీజేపీ, బీఆర్‌‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.