హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

KMR: సీతారాంపూర్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ సంజీవ్ తెలిపారు. ఆదివారం గ్రామంలోని మంచినీటి ట్యాంకు వద్ద పైపులైన్ లీకేజీకి పంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.