హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జట్ల ఎంపిక

NZB: జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అండర్-13 బాలబాలికల జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక తొర్లికొండ ZPHS పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు ఎంపిక చేశారు.