హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన రాజోలు ఎమ్మెల్యే

కోనసీమ: సఖినేటిపల్లి గ్రామంలో రూ.55.30 లక్షల పుష్కరాల నిధులతో 850 మీటర్ల మేర నాలుగు సీసీ రోడ్ల నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. పుష్కర భక్తులతో పాటు స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్ల పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు.