కృష్ణా: గన్నవరం విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపు కోసం నివాస స్థలాలు కోల్పోయిన దావాజీగూడెం బాధితుల రిలే నిరాహార దీక్షలు ఆదివారం 7వ రోజుకు చేరాయి. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితుల ప్రతినిధి వేదవతి తెలిపారు. 11 ఏళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
దావాజీగూడెం బాధితుల రిలే దీక్షలు 7వ రోజుకు


