హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌లో జన తెలంగాణ పార్టీ సన్నాహక సమావేశం

ADB: ఆదిలాబాద్‌ న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో జన తెలంగాణ పార్టీ సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. నాయకులు లంక పాపిరెడ్డి, అజయ్, దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతామని, త్వరలో పార్టీని రిజిస్టర్ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అడాక్ కమిటీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.