హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వప్నలోక్ లో ఘనంగా శాఖా సప్తాహం

KMR: ప్రతి ఒక్కరూ రోజుకు గంటసేపు శారీరక వ్యాయామం చేయడం అవసరమని జిల్లా సహ సంఘ చాలక్ కొమీరెడ్డి స్వామి అన్నారు. కామారెడ్డి స్వప్నలోక్ కాలనీలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాఖా సప్తాహం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు శాఖా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.