హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిమ్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

కడప రిమ్స్‌లో సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులపై ఏజెన్సీలు వేధింపులకు పాల్పడుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా ఆరోపించారు. వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల తొలగింపులు, బెదిరింపులు ఆపాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.