KMR: తాడ్వాయి మండలంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన, అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం పరామర్శించారు. మండలంలోని కాళోజివాడిలో హాస్టల్‌లో ప్రమాదవశాత్తు గాయపడిన గడ్డం హేమచంద్రికను, అదే గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన శివలింగం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ


