ADB: ఇంద్రవెల్లి మండలం ముత్తునూరు గ్రామంలోని మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమాన్ నగర్ కు గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఖాళీ బిందెలతో మహిళలు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే నీటి సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
తెలంగాణ
నీటి సరఫరా నిలిచిపోవడంతో రోడ్డెక్కిన మహిళలు


