హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళ క్రికెటర్లను కలవడం గర్వంగా ఉంది'

VZM: దేశ క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా 2025 విశ్వ విజేతలుగా నిలిచిన అంధుల‌ మహిళా క్రికెటర్లను కలవటం చాలా గర్వంగా ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ విభిన్న ఛైర్మన్ పాల్గొన్నారు.