హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యార్వీ షరీఫ్ అన్నదాన విందు

NTR: నందిగామ పట్టణం డీవీఆర్ కాలనీలో ఆదివారం గ్యార్వీ షరీఫ్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూరానీ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, చిన్నారుల ర్యాలీ నిర్వహించారు. హజ్రత్ గౌసే పాక్ పేరు మీద మధ్యాహ్నం లంగర్ షరీఫ్ ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకలు సోదరభావానికి, త్యాగానికి ప్రతీక అని తెలిపారు.