హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి'

ASR: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దేవదాసు వైద్యులను కోరారు. ఆదివారం అరకు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. మందులు, వైద్య పరీక్షలు, తాగునీరు, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రూ.1.25కోట్లతో ప్రారంభించిన ఐపీహెచ్ఎల్ ను అందుబాటులోకి తేవాలన్నారు.