హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఎం

SRPT : బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల బిక్షం డిమాండ్ చేశారు. కూరెళ్ల గ్రామంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసీలు, పేదల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారన్నారు.