హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.7.55 కోట్లతో పోస్ట్ హార్వెస్ట్ సెంటర్ అభివృద్ధి

​BPT: పోస్ట్ హార్వెస్ట్ సాంకేతికతతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వ్యవసాయ రీసెర్చ్ డైరెక్టర్ సుమతి తెలిపారు. బాపట్లలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్‌లో రూ.7.55 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు.