హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీరందక ఎండిపోతున్న మొక్కలు..

NLG : చలకుర్తిలో ఉపాధి హామీ కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు నీరందక ఎండిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరిగినా పంచాయతీ ట్రాక్టర్లతో నీళ్లు పోయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. నాటడమే తప్ప సంరక్షణ పట్టదా అని ప్రశ్నిస్తూ, ఎన్ని మొక్కలు బతికాయో లెక్క తేల్చాలని, తక్షణమే నీటి వసతి కల్పించి నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.