KKD: పెద్దాపురంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో యాక్సిస్ బ్యాంకు సమీపంలోని భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు పెరగడంతో దొరబాబు ఈ చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దాపురంలో వైసీపీ నూతన కార్యాలయం ఏర్పాటు


