హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ పతాకధారిగా నీరూ ధండా

జపాన్‌లోని నగోయాలో రెండు వారాల పాటు సాగిన ఆసియా గేమ్స్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా పతాకాన్ని తదుపరి గేమ్స్ జరగబోయే దోహా అప్పగించారు. ఈ టోర్నీలో 3 పతకాలు సాధించిన షూటర్ నీరూ ధండాకు భారత ఒలింపిక్ అసోసియేషన్ అరుదైన గౌరవం కల్పించింది. ముగింపు వేడుకల్లో ఆమె భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించింది.