హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

SDPT: బెజ్జంకి మండలం వడ్లూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఆరాధ్య ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తిచేసుకున్న 25 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. సర్పంచ్ పులి రమేష్ గౌడ్ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు. మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని ఆయన ఆకాంక్షించారు. వార్డు సభ్యులు మంకాల స్వామి, పులి శ్రీకాంత్ ఉన్నారు.