హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టు కుటుంబానికి అండగా ఫౌండేషన్

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అరబిడ్డ అనిల్ కుమార్ సతీమణి గుండపోటుతో ఇటీవల చికిత్స పొందారు. విషయం తెలుసుకున్న ఎంఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మహతి నేడు జర్నలిస్టు కుటుంబ సభ్యులను పరామర్శించి, 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నరేంద్ర చారి, గోవర్ధన్ గౌడ్, అశోక్ కుమార్, మనీ ప్రసాద్ పాల్గొన్నారు.