హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి: ఆర్‌.కృష్ణయ్య

VIDEO: బీసీ హాస్టళ్లు, గురుకులాలకు ప్రభుత్వం వెంటనే సొంత భవనాలు నిర్మించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. అద్దె భవనాల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలకు నెలకు రూ.1000, బాలురకు రూ.500 పాకెట్‌ మనీ ఇవ్వాలని కోరారు.