హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు కాలువల్లో మంచినీటి పైపు లైన్

KMR: కేంద్రంలోని ఒకటో వార్డులో మంచినీటి పైపులైన్‌ను మురుగు కాలువల గుండా ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. పైపులైన్ లీకేజీ అయినప్పుడు మంచినీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువల గుండా వేసిన పైపులైన్ ద్వారా నల్లాల నుంచి మంచినీటిని పట్టుకుంటున్నామని చెప్పారు. కొన్ని చోట్ల కాలువల్లో బకెట్లు పెట్టి నీటిని తోడుకోవాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు.