హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి స్థలాల కోసం అక్టోబర్‌ 5న మహాధర్నా

GNTR: అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్‌కుమార్‌ ఆదివారం కోరారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందించాలని తెలిపారు. ఈ డిమాండ్లపై అక్టోబర్‌ 5న కలెక్టర్‌ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.