హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు

KMR: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంటను రోడ్లపై ఆరబెట్టి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో దళారులకు తక్కువ ధరకు పంటను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని భిక్కనూర్‌కు చెందిన మహిళా రైతులు తెలిపారు.