హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండేరు వంతెన దగ్గర మహిళ మృతదేహం లభ్యం

కృష్ణా: చల్లపల్లి మండలం కొత్త మాజేరులో గుండేరు వంతెన దగ్గర ఆదివారం మహిళ మృతదేహం లభించింది. పోలీసులు ఆమెను ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామానికి చెందిన తెనాలి ఝాన్సీరాణి (53)గా గుర్తించారు. ఆమె కుమారుడు గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి మానసిక స్థితి సరిగా లేనట్లు బంధువులు తెలిపారు. ఆమె భర్త వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.