హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని ఆంజనేయస్వామి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువలను ఆయన పరిశీలించారు. అనంతరం యాగంటి పల్లె రోడ్డులో ఉన్న బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆయన పేర్కొన్నారు.