హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BCలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: BSP

కోనసీమ: అంబేద్కర్ భవన్లో ఆదివారం ముమ్మిడివరం నియోజకవర్గ బీఎస్పీ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేతలు కోరారు.