హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి బీసీని కలిసిన APWJF నేతలు

NDL: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా నూతన కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు జి.మద్దయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు జి.నరసింహారెడ్డి, సహాయ కార్యదర్శి ఎం.రామచంద్రారెడ్డి, తదితరులు మంత్రికి జ్ఞాపిక అందజేసి సన్మానించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు.