హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సీపీఐ నిర్ణయం'

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్న చోట్ల ఎన్డీఏ వ్యతిరేక పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అజయ్‌కుమార్‌ ఆదివారం గుంటూరులో తెలిపారు. ఓట్ల తొలగింపును ఆపాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 26న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు.