హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు జలమార్గం..!

విశాఖ: నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఫెర్రీ/క్రూయిజ్ బోట్లు నడిపే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 80 మంది ప్రయాణికులను తీసుకెళ్లే చిన్న నౌకలతో గంటలోపే ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. ఇందుకోసం సాగరనగర్, రుషికొండ, ఫిషింగ్ హార్బర్ వద్ద ప్యాసింజర్ జెట్టీలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. జెట్టీలకు బస్సులు, క్యాబ్ సేవలు అందుబాటులోకి తేనున్నారు.