హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సాయంత్రం టీతో ఇవి తింటున్నారా..?

సాయంత్రం వేడి వేడి టీతో పాటు సమోసాలు, పకోడీలు, బిస్కెట్లు లాగించేస్తున్నారా? అయితే జాగ్రత్త. నూనెలో వేయించిన ఇలాంటి జంక్ ఫుడ్ రోజూ తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. టీతో పాటు వేయించిన పదార్థాలకు బదులుగా నానబెట్టిన గింజలు, మఖానా, లేదా వేయించిన శనగలు వంటి ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఎంచుకోవడం బెటర్.