ASF: యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెబ్బెన మండలం గోలేటి లో జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్, SGF జిల్లా సెలక్షన్స్ ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. సబ్ జూనియర్,జూనియర్ విభాగాల్లో బాల, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
తెలంగాణ
'యోగాసన ఎంపిక పోటీలు విజయవంతం'


