చాలామందికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. అయితే ఇది ఒత్తిడి, నిద్రలేమి, నీరు తక్కువగా తాగడం, లేదా సైనస్ సమస్యల వల్ల రావచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువసేపు ఉండటం, కంటి సమస్యలు కూడా కారణమే. అందుకే ప్రతిరోజూ తగినంత నీరు తాగి, కంటికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
ఆరోగ్యం
తరచూ తలనొప్పి వస్తుందా..?


