హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజిలిపేటలో పోలీసుల మెగా కార్డన్ సెర్చ్

BPT: చీరాల మండలం విజిలిపేటలో పోలీసులు ఆదివారం విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఒకటి, రెండో పట్టణ సీఐల ఆధ్వర్యంలో 65 మంది సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 4 ఆటోలు, 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.