GNTR: తెనాలి గాంధీ ఇర్విన్ పార్క్ రైతు బజార్‌లో కిలో రూ.35కే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయ కౌంటర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి స్వయంగా ఉల్లిపాయలను అందజేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉల్లిపాయల ధరలపై పేదలకు ఊరట


