ATP: గుంతకల్లు శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 6న ఉదయం 6:30 నుంచి 9 వరకు వరుణ యాగం, వరుణ జపం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మల్లికార్జున, ధర్మకర్తల మండలి ఛైర్మన్ లోకేంద్ర నాథ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సకాలంలో వర్షాలు కురవాలని దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 6న ఆలయంలో వరుణ యాగం


