ATP: కళ్యాణదుర్గం మండలంలోని విట్లంపల్లి–హులికల్లు నూతన రహదారిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించి, ప్రజలకు అంకితమిచ్చారు. రూ. 3.14 కోట్ల నిధులతో నిర్మించిన ఈ రహదారితో ఏళ్లుగా గుంతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం


