హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరుగుల పోటీలో పతకాల పంట.. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత!

TPT: జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్‌లో నాయుడుపేట క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన అండర్-17 పోటీల్లో నాయుడుపేట స్పోర్ట్స్ ఫెడరేషన్‌కు చెందిన మయూరి 3,000 మీటర్లు, మోక్ష 1,500 మీటర్ల పరుగులో ప్రథమ స్థానాలు సాధించారు. అలాగే, మహిదర్ 3,000 మీటర్ల పరుగులో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.