హైదరాబాద్: 28°C
క్రీడలు

మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్యా

భారత్-ఎ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా-ఎ తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కుడి కాలి మోకాలి గాయం కారణంగా టూర్‌కు దూరమయ్యాడు. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతుండగా ఈ గాయమైంది. వైద్యుల సూచన మేరకు అతను 3 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. దీంతో అతడి స్థానంలో ముంబై యువ ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేకు సెలక్టర్లు అవకాశం కల్పించారు.