ASR: అరకువేలి మండలం సుంకరమెట్ట-డుంబ్రిగుడ చాపరాయి రహదారి గుంతలమయంగా మారి, వర్షాలకు రోడ్డు ఒడ్డు కుంగి ప్రమాదకరంగా తయారైందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు పంచాయతీల ప్రజలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి'


