KKD: తుని పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీ సత్రంలో ఆదివారం చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే తుని టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై విజయబాబు కోరారు. వివరాల కోసం 9440796572, 6281500904 నంబర్లను సంప్రదించాలని పోలీసులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ హత్య కేసు.. నిందితుడి ఫొటో విడుదల


